దేశంలోనే సీనియర్ నాయకుడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 2024లో గెలిచిన తర్వాత ఆయన ప్రభుత్వం ఇప్పటి వరకు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. అయితే ఇందులో రైతులకు బాబు చెప్పిన హామీలు ఏవీ? ఎన్ని హామీలు అమలు చేశారు అనే విషయానికి వస్తే.. అన్నదాతలకు ఇచ్చిన ముఖ్యమైన హామీ అన్నదాత సుఖీభవ. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో కాకుండా తాను ఏటా రూ.20వేలు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండో ఏడాది అయినా పూర్తిగా ఇచ్చారా అంటే అదీ లేదు. కేవలం రూ.10వేలు మాత్రం ఇచ్చారు. అందులో కూడా 7 లక్షల మందికి కోతలే.
2023లో లబ్ధి పొందిన రైతులు: 53.58 లక్షలుఈ లెక్కన ఏడాదికి అవసరమైన మొత్తం: రూ.10,717 కోట్లురెండేళ్లకు ఇవ్వాల్సింది: రూ.21,434 కోట్లుఅయితే ఈ రెండేళ్లలో ఇచ్చింది కేవలం రూ.4,685 కోట్లు మాత్రమే.ఒక్కో రైతుకు రావాల్సిన రూ.40 వేలలో ఇచ్చింది రూ.10 వేలేఅంటే ప్రతి రైతుకు సుమారు రూ.30 వేల బకాయిమొత్తం రైతులకు బకాయి: రూ.16,749 కోట్లు
వైయస్ జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా కింద 53.58 లక్షల మంది రైతులకు సహాయం అందిస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇప్పుడు కేవలం 46.85 లక్షల మందికే ఇచ్చారు. దాదాపు 7 లక్షల మందికి కోత విధించారు.
ఉచిత పంటల బీమా కింది ఇచ్చింది సున్నాప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ఇచ్చింది సున్నాఇన్‌పుట్ సబ్సిడీ పరిహారం లేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అధికారం కోసం రైతులకు నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చి గద్దెనెక్కగానే రైతులను నిండా ముంచారు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మూడు బడ్జెట్లలోనూ రైతులకు ఒరిగిందేమీ లేదు.






