---Advertisement---

బాబు పాలనలో అప్పుల పరంపర

అప్పులే అభివృద్ధి మార్గమా?... బాబు పాలనలో పెరుగుతున్న రుణభారం వెనుక గుట్టు ఏమిటి?
---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుల అంశం మరోసారి రాజకీయంగా, ఆర్థికంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన చంద్రబాబు వచ్చే మంగళవారం మళ్లీ రూ.3,100 కోట్లు అప్పు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ రుణాన్ని సమీకరించనున్నట్లు ఆర్‌బీఐ నోటిఫై చేసింది.

విమర్శకుల ప్రశ్నలు:

ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న రాష్ట్రం మరిన్ని రుణాలు ఎందుకు తీసుకుంటోంది?
సంపద సృష్టి వాగ్దానాలు ఎక్కడికి పోయాయి?
అప్పులతో అభివృద్ధి సాధ్యమా? లేక ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందా?
మూడోసారి రుణం, ఈ నెలలోనే రూ.6,900 కోట్లు
ఇవ‌న్నీ ఏమ‌వుతున్నాయ‌ని సామాన్యులు ప్ర‌శ్నిస్తున్నారు.

గతంలో అధిక అప్పులు ప్రమాదకరమని, శ్రీలంక పరిస్థితి రాకూడదని హెచ్చరికలు చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు అవే త‌ప్పులు ఎందుకు చేస్తున్నార‌ని సామాన్య ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

రూ.3 లక్షల కోట్ల అప్పు దాటిన రాష్ట్రం మళ్లీ భారీ రుణాల వైపు వెళ్లడం ఆర్థిక నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ అప్పులు రాష్ట్ర అభివృద్ధికి బలం అవుతాయా? లేక భవిష్యత్తుకు భారమవుతాయా? అనే చర్చ మరింత వేడెక్కే అవకాశం ఉంది.

ఏది ఏమైనా చంద్ర‌బాబు చేస్తున్న అప్పుల‌పై రాష్ట్ర ప్ర‌జ‌లు ఆగ్ర‌హంగా ఉన్నార‌న్న‌ది వాస్త‌వం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment