---Advertisement---

రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ ఉందా?

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయా?... లా అండ్ ఆర్డర్‌పై పెరుగుతున్న ఆరోపణల వెనుక వాస్తవం ఏమిటి?
---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాల సంఖ్య, దౌర్జన్యాలు, మహిళలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించగా, ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేస్తోంది. దీంతో లా అండ్ ఆర్డర్ అంశం రాజకీయ వేదికల నుంచి సోషల్ మీడియా వరకు విస్తృత చర్చకు దారి తీసింది.

కేంద్ర నివేదికలు, గణాంకాలపై వాదోపవాదాలు
బొత్స సత్యనారాయణ తన విమర్శలకు కేంద్ర సంస్థల నివేదికలను ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పనితీరు దేశంలో దిగువ స్థానాలకు పడిపోయిందని ఆయన పేర్కొనడం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వైఎస్సార్‌సీపీ హయాంలో పోలీస్ వ్యవస్థ మెరుగ్గా పనిచేసిందని ప్ర‌తిప‌క్షం గ‌ట్ట‌గా చెబుతోంది.

రాజమండ్రి ఘటనతో మళ్లీ చర్చలోకి ప్రజా భద్రత
రాజమండ్రిలో కల్తీ పాలు తాగి జరిగిన మరణాల ఘటనను విపక్షం ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణగా చూపుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, నేరస్తుల్లో భయం లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. బాధితులకు న్యాయం జరిగిందా? నియంత్రణ వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయి? అనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు.

“డైవర్షన్ పాలిటిక్స్” ఆరోపణలపై చర్చ
ప్రభుత్వ వైఫల్యాలను దాచేందుకు ఇతర అంశాలను ముందుకు తెస్తోందని విపక్షం ఆరోపిస్తోంది. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రస్తుతం జరుగుతున్న సమస్యలపై దృష్టి మళ్లిస్తున్నారన్న అభిప్రాయం సోషల్ మీడియాలో కూడా కనిపిస్తోంది. అయితే అధికార పక్షం మాత్రం ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోందని అంటోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment