---Advertisement---

రైతు సంక్షేమం మాటల్లోనేనా?

రైతు సంక్షేమం హామీలు ఎక్కడ?… గ్రామాల్లో పెరుగుతున్న అసంతృప్తి వెనుక అసలు కారణాలేమిటి?
---Advertisement---

ఎన్నికల ముందు రైతు సంక్షేమం పేరుతో భారీ హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో పూర్తిగా విఫలమైందని రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచుతామని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీలు ఇప్పుడు రైతుల దృష్టిలో నీటిమీద రాతలుగా మారాయని గ్రామాల్లో చర్చ జరుగుతోంది.

అన్నదాత సుఖీభవ హామీ ఏమైంది?
ఎన్నికల సమయంలో కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌కు అదనంగా రాష్ట్రం నుంచి రైతులకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీ అమలు కాలేదని రైతు సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మొదటి ఏడాది ఈ పథకం అమలు చేయకపోవడమే కాకుండా, తరువాత లబ్ధిదారుల సంఖ్యలో కూడా భారీ కోత విధించారని ఆరోపణలు వస్తున్నాయి.

సీజన్ వస్తే సమస్యలే
రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇవీ…
సకాలంలో విత్తనాలు అందకపోవడం, ఎరువుల కొరత, అకాల వర్షాలు, వాతావరణ మార్పులు, వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడం, ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్ర కష్టాలు పడుతూ పంటలు పండిస్తున్నా, మార్కెట్‌లో సరైన ధరలు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు.

గిట్టుబాటు ధరల లేమి
రైతుల ప్రకారం ముఖ్యంగా ఈ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.. మిర్చి, మొక్కజొన్న, పత్తి, వరి, కూరగాయలు. మార్కెట్ యార్డుల్లో ధరలు పడిపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాకుండా పోతున్నాయని చెబుతున్నారు.

రైతులను ఆదుకునే వ్యవస్థ ఎక్కడ?
రైతు సంఘాలు చెబుతున్న ప్రకారం.. పంట నష్టపోతే ఇన్‌పుట్ సబ్సిడీ లేదు. పంట బీమా ప్రయోజనం రైతులకు అందడం లేదని విమర్శ, ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ బలహీనంగా ఉందని ఆరోపణ, దీంతో రైతులు పూర్తిగా మార్కెట్ దయపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

అప్పులు – ఆత్మహత్యల ఆందోళన
వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు పెరగడం, పంటలకు సరైన ధరలు లేకపోవడం వల్ల రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. బ్యాంకులు, ప్రైవేట్ రుణదాతల వద్ద తీసుకున్న అప్పులు తీర్చలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి. రైతు ఆత్మహత్యల ఘటనలు కూడా రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయని వారు అంటున్నారు.

గ్రామాల్లో పెరుగుతున్న అసంతృప్తి
రైతు సంక్షేమం పేరుతో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment