రాష్ట్ర అభివృద్ధి గురించి రాజకీయ వేదికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. “సంపద సృష్టి”, “అభివృద్ధి” అనే మాటలు తరచూ వినిపిస్తున్నాయి. అయితే ఈ మాటల వెనుక వాస్తవ పరిస్థితి ఏమిటి? కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కాగ్ (CAG), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లెక్కలు చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వేరే చిత్రమే కనిపిస్తోంది. ఆదాయం తగ్గడం, రెవెన్యూ లోటు పెరగడం, అప్పులు భారీగా పెరగడం వంటి అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చెప్పే అభివృద్ధి మాటలకు ఈ లెక్కలు సరిపోతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.
రాష్ట్ర ఆదాయం తగ్గుదల
రాష్ట్ర ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవడానికి ముందుగా ఆదాయాన్ని పరిశీలించాలి.
వైయస్ జగన్ పాలనలో (2023–24) రాష్ట్ర ఆదాయం రూ.1,73,767 కోట్లు
బాబు పాలనలో (2024–25) రాష్ట్ర ఆదాయం రూ.1,68,024 కోట్లు అంటే ఒక సంవత్సరం వ్యవధిలో రాష్ట్ర ఆదాయం తగ్గినట్లు ఈ లెక్కలు సూచిస్తున్నాయి. అభివృద్ధి పెరుగుతోందని చెప్పే సమయంలో ఆదాయం తగ్గడం ఆర్థిక నిపుణుల్లో చర్చకు దారి తీస్తోంది.
రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరుగుదల
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన సూచికలు రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు.
జగన్ పాలన 2023–24తో పోలిస్తే..
రెవెన్యూ లోటు 56% పెరిగింది.
రూ.38,682 కోట్ల నుంచి
రూ.60,285 కోట్లకు
ద్రవ్యలోటు (అప్పులు) 30% పెరిగింది
రూ.62,719 కోట్ల నుంచి
రూ.81,071 కోట్లకు
అంటే ప్రభుత్వ ఖర్చులు ఆదాయాన్ని మించి పెరుగుతున్నాయని ఈ లెక్కలు సూచిస్తున్నాయి.
అప్పుల పరిస్థితి ఎలా ఉంది?
1- GSDPలో అప్పుల శాతం
రాష్ట్ర ఆర్థిక పరిమాణాన్ని అంచనా వేసే ముఖ్య సూచిక GSDPలో అప్పుల శాతం.
జగన్ పాలన (2019–24) ఐదేళ్లలో సగటు అప్పులు – 4%
బాబు సర్కారు (2024–25) మొదటి ఏడాదిలోనే – 5%
అంటే అప్పుల భారం ఆర్థిక పరిమాణంతో పోలిస్తే పెరిగినట్లు కనిపిస్తోంది.
2- పరిమితికి మించి తీసుకున్న అప్పులు
ఆర్థిక నియమాల ప్రకారం కేంద్రం కొన్ని పరిమితులు విధిస్తుంది.
వాటిని మించి తీసుకునే అప్పులు కూడా పరిశీలనీయమే.
2019–24 బాబు పాలనలో – రూ.29,099 కోట్లు
ఇప్పుడు బాబు పాలనలో – రూ.17,953 కోట్లు
అయితే కరోనా వంటి సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ,
జగన్ పాలనలో పరిమితి కంటే తక్కువగా చేసిన అప్పులు – రూ.12,708 కోట్లు
అని లెక్కలు చెబుతున్నాయి.
3- మొత్తం అప్పుల పోలిక
రాష్ట్ర అప్పుల పరిమాణాన్ని చూస్తే మరో ఆసక్తికర అంశం కనిపిస్తుంది.
ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు – రూ.3.31 లక్షల కోట్లు
ఈ రెండేళ్లలోనే బాబు ప్రభుత్వం చేసిన అప్పు – రూ.3.33 లక్షల కోట్లు
అంటే తక్కువ కాలంలోనే అప్పుల పరిమాణం భారీగా పెరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పారిశ్రామిక వృద్ధి పై RBI నివేదిక
ఇక పారిశ్రామిక రంగంలో గత ప్రభుత్వ కాలంలో నమోదైన పురోగతిపై రిజర్వ్ బ్యాంక్ (RBI) – Dec 24, 2025 నివేదికలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
జగన్ పాలనలో..
పారిశ్రామిక వృద్ధిలో
సౌత్ ఇండియాలో ఏపీ టాప్
దేశంలో 8వ స్థానం
తయారీ రంగంలో
సౌత్ ఇండియాలో ఏపీ టాప్
దేశంలో 5వ స్థానం
ఈ లెక్కలు రాష్ట్ర పారిశ్రామిక రంగంపై జరిగిన చర్చలకు
మరింత ప్రాధాన్యతను తెచ్చాయి.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న చర్చలో రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే కాకుండా కాగ్, ఆర్బీఐ వంటి సంస్థల లెక్కలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఆదాయం తగ్గడం, రెవెన్యూ లోటు పెరగడం, అప్పుల పరిమాణం అధికమవడం వంటి అంశాలు ఆర్థిక నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సమయంలో పారిశ్రామిక రంగంలో నమోదైన వృద్ధి మరో కోణాన్ని చూపిస్తోంది.అభివృద్ధి అంటే కేవలం పెద్ద ప్రాజెక్టులు లేదా ప్రకటనలు మాత్రమే కాదు. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం, ఆదాయం పెరుగుదల, నియంత్రిత అప్పులు కూడా అంతే కీలకం. అందుకే ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఒకటే సంపద సృష్టి నిజంగా జరుగుతోందా, లేక అప్పులే అభివృద్ధిగా చూపుతున్నామా?






