---Advertisement---

బీఆర్ నాయుడు పేరు నిజంగానే చాలా కాలం యాది ఉంటుందా ?

వైరల్ వీడియోలతో వివాదం… బీఆర్ నాయుడు పేరు నిజంగానే చరిత్రలో నిలిచిపోతుందా?
---Advertisement---

టీవీ5 అధినేత, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోల్లోని సందర్భం ఏమిటి? అవి ఎప్పుడు తీసినవి? అనే ప్రశ్నలకు స్పష్టత లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం వివిధ వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు తీవ్రంగా విమర్శిస్తుంటే, మరికొందరు వాటిని ఖండిస్తున్నారు.

ఈ ఘటనలో గమనించదగ్గ విషయం ఏమిటంటే వీడియోల కంటే వాటి చుట్టూ జరుగుతున్న వార్
ఒక వర్గం బీఆర్ నాయుడుపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ, ఆయన పేరు చాలా కాలం గుర్తుండిపోతుందని ట్రోల్స్ చేస్తోంది. మరో వర్గం మాత్రం ఆయనను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ క్యాంపెయిన్ జరుగుతోందని ఆరోపిస్తోంది.

మ‌రికొంద‌రు మాత్రం టీటీడీ వంటి ఆధ్యాత్మిక సంస్థకు ఛైర్మన్‌గా ఉన్న వ్యక్తి ప్రవర్తనపై ప్రజలు ఎక్కువగా స్పందించడం సహజమేనని కొందరు భావిస్తుంటే, “పదవిలో ఉన్నా వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి” అని మరికొందరు వాదిస్తున్నారు.

టీటీడీ ఛైర్మన్ పదవి కేవలం పరిపాలనా పదవి మాత్రమే కాదు, అది భక్తి, భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది.
అందువల్ల ఈ వివాదం రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఘటన చివరికి నిజాలు వెలుగులోకి తీసుకురాగలదా? లేక ట్రోల్స్ వరకే పరిమితం అవుతుందా?
అన్నది వేచి చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment