---Advertisement---

ఓం నమః శివాయ !

ఆ అర్థరాత్రి జాగారంలో ప్రత్యక్షమయ్యే దివ్య రహస్యం ఏమిటి?
---Advertisement---

ఆది అంతం లేని ఆదిదేవుడు పరమశివుడు. లయకర్తగా జగత్తును కాపాడే మహాశక్తి ఆయన. భ‌క్తితో పిలవగానే వెంటనే ప్రసన్నమయ్యే ఆ నీలకంఠుడు.ఆ దేవ దేవుడిని పూజిస్తే మనసుకు శాంతి, జీవితం లో ధైర్యం కలుగుతాయని భ‌క్తుల విశ్వాసం. శివపూజ మనలో వినయం, సమత్వం, అంతర్ముఖత పెంపొందిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు.

శివరాత్రి విశిష్టత
పురాణాల ప్రకారం శివ‌ రాత్రి శివుడు అనంత జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమై బ్రహ్మ, విష్ణువులకు తన మహిమ చూపిన రోజు. అలాగే పార్వతీ దేవితో శివుని వివాహం జరిగిన పవిత్ర సందర్భంగా కూడా భావిస్తారు. అందుకే ఈ రోజు ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు, శివకల్యాణాలు నిర్వహిస్తారు. భక్తులు బిల్వదళాలు సమర్పించడం అత్యంత శుభకరంగా పరిగణించబడుతుంది.

జాగారం ఎందుకు చేయాలి?
శివరాత్రి రాత్రి నిద్రపోకుండా జాగారం చేయ‌డం అంటే ఆధ్యాత్మికంగా “అజ్ఞాన నిద్ర” నుంచి బయటపడటం అనే అర్థం. రాత్రంతా శివనామస్మరణ, భజనలు, ధ్యానం చేయడం ద్వారా మనస్సు ఏకాగ్రత పొందుతుంది. ఉపవాసం, జాగారం కలయిక శరీరాన్ని నియంత్రించి, ఆత్మశక్తిని పెంచుతుందని యోగశాస్త్రం చెబుతుంది. భక్తి భావంతో జాగారం చేసిన వారికి శివానుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

శివ‌రాత్రి రోజుల పాటించాల్సిన‌వి
ఈ రోజు ఉపవాసం ఉండటం, పాలు, నీరు, తేనెతో శివలింగానికి అభిషేకం చేయడం, బిల్వపత్రాలు సమర్పించడం, పంచాక్షరి మంత్రం జపించడం ముఖ్యమైన ఆచారాలు. తెల్లవారుజామున స్నానం చేసి శివదర్శనం చేస్తే పుణ్యం కలుగుతుందని చెబుతారు. కుటుంబ సమేతంగా పూజలు చేయడం ద్వారా శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment