రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి అస్వస్థతకు గురైన బాధితులలో మరొకరు ఈ రోజు మృతి చెందారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జి. సూర్యారావు (81) ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 7కు పెరిగింది.
కల్తీ పాలు సేవించడం వల్ల పలువురు తీవ్ర అస్వస్థతకు గురవగా, ప్రస్తుతం మరో 13 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటనపై ఆహార భద్రత అధికారులు, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కల్తీ పాల సరఫరాకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.






