పెళ్లి వేడుకల సందడి ముగిసిన వెంటనే హీరో విజయ్ దేవరకొండ మళ్లీ సినిమాల పనుల్లో బిజీ అవుతున్నారు. ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్నతో వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విజయ్, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో సొంతూరులో పెళ్లి వేడుకను జరుపుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ నిర్వహించారు. ఆ కార్యక్రమాలు పూర్తయ్యాక ఇప్పుడు తిరిగి షూటింగ్‌లపై దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘రౌడీ జనార్థన్’, ‘రణబాలి’ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబలి’పై ప్రత్యేకంగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. కర్నూల్లో జరగనున్న ఈ షెడ్యూల్లో విజయ్ దేవరకొండ కూడా పాల్గొననున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుందని సమాచారం. దర్శకుడు శౌర్యువ్‌తో విజయ్ కథా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’ చిత్రంతో గుర్తింపు పొందిన శౌర్యువ్ మొదట ఈ కథను మరో హీరోతో చేయాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అనంతరం తమిళ హీరోకు కూడా కథ చెప్పినట్లు తెలుస్తోంది. చివరికి ఈ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండతో చేయాలని నిర్ణయించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమా పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించేలా రూపొందించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా విజయ్ దేవరకొండ సినిమాల పరంగా మరింత బిజీగా మారినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా, మరో కొత్త ప్రాజెక్ట్ కూడా లైన్లోకి రావడంతో రాబోయే రోజుల్లో ఆయన నుంచి వరుస సినిమాలు ప్రేక్షకులను అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.






