టాలీవుడ్‌లో ఎక్కువకాలంగా చర్చకు దారి తీసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నెక్ట్స్ ఏంటి? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేకంగా గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ వేడుకపై సినీ వర్గాల్లో చర్చ సాగుతుండగా, మరో ఆసక్తికరమైన అంశం కూడా చర్చకు వస్తోంది, పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కడ కాపురం పెట్టబోతున్నారు అన్నది.
రష్మిక బాలీవుడ్ బిజీ
ఇటీవల కాలంలో రష్మిక మందన్న బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా మారింది. బాలీవుడ్‌లో తన కెరీర్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముంబయిలో లగ్జరీ ఫ్లాట్ కూడా కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలోనే విజయ్ దేవరకొండ కూడా తరచూ ముంబయికి వెళ్లి వచ్చేవాడని సినీ వర్గాల్లో టాక్ వినిపించింది.
హైదరాబాద్, ముంబై మధ్య సమతుల్యం
పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో ఉంటే, రష్మికకు తరచూ ముంబయికి వెళ్లి రావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది. మరోవైపు విజయ్ దేవరకొండ షూటింగ్స్ ఎక్కువగా హైదరాబాద్‌లోనే జరుగుతుండటంతో ఆయన ముంబయికి పూర్తిగా మకాం మార్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
ప్రస్తుతం మాత్రం కలిసి
ప్రస్తుతం ఈ జంట కలిసి ఒక సినిమా చేస్తుండటంతో కొంతకాలం హైదరాబాద్‌లోనే విజయ్ దేవరకొండ నివాసంలో ఉండబోతున్నట్టు సమాచారం. తర్వాత మాత్రం వారి షూటింగ్ షెడ్యూల్స్, సినిమాల కాల్షీట్లు ఎలా ఉంటాయన్న దానిపై ఆధారపడి హైదరాబాద్ లేదా ముంబయిలో ఉండాలన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సినీ కెరీర్‌తో పాటు కొత్త జీవితం ప్రారంభించిన ఈ జంట భవిష్యత్తులో ఏ నగరాన్ని తమ స్థిర నివాసంగా ఎంచుకుంటారన్నది మాత్రం ఆసక్తిగా మారింది.






